GDWL: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధి షెక్షావలి ఆచారి అన్నారు. ఆదివారం అయిజలో నూతన డ్యాన్స్ స్కూల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డ్యాన్స్ మాస్టర్ ప్రభాకర్‌ను అభినందిస్తూ.. విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా ఏదో ఒక కళను నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.