NGKL: సామాజిక ఉద్యమాలకు, కుల వివక్ష వ్యతిరేక పోరాటాలకు CITU ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు తెలిపారు. కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్యంగా ఎదుర్కోవాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే ఏప్రిల్ 19న జరిగే సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.