WNP: ఆత్మకూరుకు చెందిన మజీద్ అనే వ్యక్తికి గుండె శస్త్రచికిత్స కోసం రూ.5,50,000 విలువైన ఎల్బీసీ (LOC) మంజూరైంది. ఆదివారం ఉదయం మంత్రి శ్రీహరి స్వయంగా చెక్కును బాధితుడికి అందజేశారు. పేదలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి అన్నారు. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన తెలిపారు.