ATP: పీఏబీఆర్ కుడి కాలువ గేటును అధికారులు విజయవంతంగా మూసివేసి, నీటి సరఫరాను నిలిపివేశారు. 132 రోజుల పాటు 4.5 టీఎంసీల నీటిని విడుదల చేసి 48 చెరువులను నింపారు. ప్రస్తుతం జలాశయంలో 2.623 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూలై వరకు ఉమ్మడి అనంతపురం జిల్లా తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఎస్ఈ సుధాకర్ రావు స్పష్టం చేశారు.