TG: రహదారి భద్రత అనేది కేవలం నిబంధనల అమలు మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని CP సజ్జనార్ స్పష్టం చేశారు. DGP శివధర్ రెడ్డి మానసపుత్రిక అయిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో ఏటా హత్యల వల్ల సుమారు 800 మంది మరణిస్తుండగా, రోడ్డు ప్రమాదాల వల్ల ఏకంగా 7,500 మంది ప్రాణాలు కోల్పోతున్నారని CP ఆవేదన వ్యక్తం చేశారు.