హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,840గా ఉండగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం ధర రూ.1,40,100 వద్ద కొనసాగుతోంది. వెండి కూడా కిలో రూ.2,65,000 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.