ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో ఆయన మూవీ చేయనున్నట్లు సమాచారం. బాహుబలి, RRR వంటి మూవీలకు కథలందించిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కథను అందించారట. ఇది ఒక భారీ బడ్జెట్ పీరియడ్ యాక్షన్ డ్రామా లేదా హిస్టారికల్ మూవీ అయ్యే అవకాశం ఉందట. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయట.