TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. నిన్న 22 జిల్లాల్లో 41 నుంచి 41.8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో రెండు, మూడు డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.