HNK: జిల్లా కేంద్రంలోని పద్మిని కాలనీలో ఈ నెల 19న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్-7, 11, 15 బాలబాలికల చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా అండర్-7 విభాగంలో ప్రతిభ చాటిన నలుగురు బాలురు, నలుగురు బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.