TG: వరంగల్‌లో అమానవీయ ఘటన జరిగింది. పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం గంజాయి బ్యాచ్ దారుణానికి పాల్పడింది. లేబర్ కాలనీలో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిపై బండరాళ్లతో దాడి చేసింది. బాధితుడు సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఎంజీఎం ఆస్పత్రికి స్థానికులు తరలించారు. నెల రోజుల క్రితం కూడా ఇదే మిల్స్ కాలనీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.