HYD: ఫిర్జాదిగూడ మహారాజ ఫోర్ట్ సమీపంలోని మూసీ నాలాలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, ఆ వ్యక్తి (సుమారు 45) 3- 4 రోజుల క్రితం మృతి చెందినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహంపై దుస్తులు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.