TG: మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులు రోహిత్ రెడ్డి, రితిష్ రెడ్డి, నమిత్ శర్మలను మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు 5 రోజుల కస్టడీకి కోరగా, కోర్టు 2 రోజుల విచారణకే అనుమతినిచ్చింది. దీంతో డ్రగ్స్ పార్టీ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలపై ఈరోజు, రేపు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు.