TG: రాష్ట్రంలో మరోసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఈనెల 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో TET నిర్వహించారు. రెండో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. జూన్ రెండో వారంలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది.