SKLM: ఎచ్చెర్లలలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశానికి ఇవాళ ఎంపీపీ చిరంజీవి అధ్యక్షత వహించారు. రానున్న వర్షాకాల సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది సంసిద్ధంగా ఉంటూ ప్రజలను వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు. హాస్పిటల్ నందు మందుల నిర్వహణ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టీలు పరిశీలించారు.