MDK: మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంతోష (45) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం సంసారం విషయంలో భర్త సత్యనారాయణతో, భార్య సంతోష గొడవపడి, ఇంట్లోంచి వెళ్లి కనిపించకుండా పోయింది. సంతోష కోసం కుటుంబీకులు వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమొదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.