TG: మేడ్చల్ పరిధిలో HIV సోకిన రక్తం ఎక్కించిన ఘటనలో ఆత్మహత్య చేసుకున్న బాధితురాలి సూసైడ్ నోట్ కన్నీరు పెట్టిస్తోంది. ‘మీరు ఎంతో కష్టపడి చదివించినా, నా జీవితాన్ని నేనే నాశనం చేసుకుంటున్నాను. మరో జన్మ అంటూ ఉంటే మళ్లీ మీ కడుపులోనే పుట్టాలని కోరుకుంటున్నా. అమ్మా, నాన్న.. నన్ను క్షమించండి’ అంటూ ఆమె రాసిన చివరి లేఖను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.