MBNR: దేవరకద్ర మున్సిపల్ కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రికెట్ టోర్నమెంట్ను బీజేపీ ఇన్ఛార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.