సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే నటి అనసూయ భరద్వాజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ‘శివాజీ దెబ్బకు చీర కట్టుకుని తిరుగుతున్న అనసూయ’ అనే థంబ్ నెయిల్తో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అనవసరంగా వ్యక్తిగత విషయాలను ఇతరులతో ముడ్డిపెట్టవద్దన్నారు. అంతకుముందు తాము చీరలు కట్టుకోలేదా? అని మండిపడ్డారు. నటిగా నచ్చిన దుస్తులు ధరిస్తానన్నారు.