KNR: ఇల్లందకుంట మండల బీజేపీ నూతన కార్యవర్గాన్ని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి శనివారం ప్రకటించారు. మండల ప్రధాన కార్యదర్శులుగా గుత్తికొండ రాంబాబు, అబ్బీడి తిరుపతి రెడ్డి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులు, కార్యదర్శులు సహా 45 మందితో బృందం ఏర్పాటు చేశారు. వివిధ మోర్చాలకు అధ్యక్షులను ఎంపిక చేసిన అనంతరం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.