తాను 9 సినిమాలు చేస్తే.. 19 చిత్రాలు క్యాన్సిల్ అయ్యాయని దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. తిరువీర్ నటించిన ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దుర్గా నరేష్ ఎంతో కష్టపడి ఈ సినిమా తెరకెక్కించారని.. తిరువీర్ యాక్టింగ్ తనకెంతో నచ్చిందని అన్నారు. ప్రీమియర్ రోజు తాను ఈ చిత్రాన్ని చూస్తానని చెప్పారు.