MHBD: గూడూరు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఇటీవల బదిలీ అయ్యారు. ఇన్ఛార్జ్ FDOగా ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ కరుణాకర్ చారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వ ఆదేశాల మేరకు కరుణాకర్ చారి నిన్న బాధ్యతలు చేపట్టారు.గూడూరు ఫారెస్ట్ డివిజన్‌కు పూర్తిస్థాయి అధికారి బాధ్యతలు చేపట్టే వరకు కరుణాకర్ విధులు నిర్వర్తించనున్నారు.