BHPL: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో రూ. 200 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పునర్నిర్మాణ పనులు ఈ నెల 17న ప్రారంభం కానున్నాయి. 11 ఉప ఆలయాలు, ప్రధాన గర్భాలయం, అర్థమండపం, ధ్వజస్తంభం, ప్రాకారం, 4 రాజగోపురాలు నిర్మించనున్నారు. అలాగే పాకశాల, విజయగణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల నిర్మాణం చేపడతారు. గర్భాలయం ఏకశిలా రాతి కట్టడాలతో రూపుదిద్దుకోనుంది.