PLD: నాదెండ్ల మండలం, ఇర్లపాడు గ్రామంలోని పొలాల్లో దుండగులు పది మంది రైతుల బోరు మోటార్లను ధ్వంసం చేసి, అందులోని రాగి తీగలను దొంగిలించారు. ఈ ఘటన వల్ల ఒక్కో రైతుకు మరమ్మతుల కోసం అదనపు ఖర్చుతో కలిపి మొత్తం సుమారు రూ. 1.30 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఈ చోరీపై బుధవారం కేసు నమోదు చేసుకున్న నాదెండ్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.