TG: పల్నాడు జిల్లా చేజర్లలో మానవత్వం మంటగలిసింది. ఓ ఒంటరి మహిళపై అదే గ్రామానికి చెందిన సుధాకర్, శ్రీను అనే అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ ఘోరాన్ని వీడియో తీసి రాక్షసానందం పొందారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలిని వైద్య పరీక్షల కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.