VZM: గ్రామాల్లో స్వచ్చ భారత్ మిషన్ను సమర్ధంగా అమలు చేసే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని అధికారులకు చీపురుపల్లి DDO హేమ సుందర్ స్పష్టం చేశారు. బుధవారం స్దానిక మండల పరిషత్ కార్యాలయంలో రెండు రోజుల పాటు జరుగునున్న శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ODF గ్రామాలుగా తీర్చిదిద్దాలని, ఆదర్శవంత గ్రామాలుగా కృషి చేయాలని సూచించారు.