AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు యార్డులో లావాదేవీలు నిలిచిపోయాయి. కూలీ రేట్లు పెంచాలని హమాలీలు విధులు బహిష్కరించారు. ప్రస్తుతం రూ.12 ఇచ్చేందుకు పసుపు వ్యాపారులు అంగీకరించారు. కానీ, కాటా కూలీ బస్తాకు రూ.13కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులు దానికి అంగీకరించకపోవడంతో లావాదేవీలు నిలిచిపోయాయి.