RR: జిల్లా చటాన్‌పల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.184 కోట్లు మంజూరు చేసింది. భూసేకరణ, పరిహారం కోసం అదనంగా రూ. 34 కోట్లు కేటాయించారు. 212 మంది నుంచి 3.11 ఎకరాల స్థలాన్ని సేకరించి, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ట్రాఫిక్ సమస్యలకు ఈ బ్రిడ్జితో శాశ్వత పరిష్కారం లభించనుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.