హైదరాబాద్ IT కారిడార్లో అద్దెలు 10-20% పెరిగాయి. దీంతో 2BHK ఇళ్ల అద్దె గరిష్టంగా రూ. 42 వేలకు చేరగా, ప్రీమియం ఇళ్లు రూ. 70 వేలకు పెరిగాయి. రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుదల, ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరగడం కారణంగా ధరలు భారీగా పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్లో మరింత పెరుగుదల అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.