KNR: పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చునని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం చిగురుమామిడి మండలం సుందరగిరి రైతు వేదికలో రైతులకు ఖరీఫ్ సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలని సూచించారు. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడాలన్నారు.