చెన్నై వేదికగా DCతో జరుగుతున్న మ్యాచ్లో విజయం సాధించి ఈ సీజన్లో ఖాతా తెరవాలని CSK చూస్తోంది. అలాగే, IPLలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన సంజూ శాంసన్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఈ సీజన్లో వరుసగా 6, 7, 9 పరుగులకు పరిమితం అయ్యాడు. దీంతో DCతో జరుగుతున్న మ్యాచులోనైనా సంజూ తిరిగి ఫామ్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.