MNCL: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెల్లడించారు. ఉదయం 11.30 గంటలకు గుడిపేటలోని మెడికల్ కళాశాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నస్పూర్ లోని జిల్లా BRS కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమై, క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలక వర్గాన్ని సన్మానిస్తారని తెలిపారు.