SRD: ఝరాసంగం మండలం ఈదులపల్లి లో కరెంటు సమస్య పట్టిపీడిస్తుందని రైతులు నేడు తెలిపారు. నిత్యం విద్యుత్ కోతలు, లో వోల్టేజ్, హెచ్చు తగ్గులు సప్లై కావడంతో బోరు మోటర్లు తరచూ కాలిపోతున్నాయని BHEL రిటైర్డ్ ఉద్యోగి కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కాలంలో 6 సార్లు మోటారు కాలిపోయిందన్నారు. రైతుల కరెంటు సమస్యపై ఆయన సీఎంకు మెయిల్ ద్వారా విన్నవించారు.