HYD: దక్షిణ భారతంలో తొలిసారిగా పంజాగుట్ట NIMSలో ఏర్పాటు చేసిన ఆటోమెటిక్ ల్యాబ్లు వైద్య రంగంలో కొత్త దశను ప్రారంభించాయి. ఈ అత్యాధునిక ల్యాబ్లు రోజుకు 10 వేల పరీక్షలు నిర్వహిస్తూ, కేవలం 4 గంటల్లోనే రిపోర్టులు అందిస్తున్నాయి. దీంతో రోగులకు వేగవంతమైన, ఖచ్చితమైన చికిత్స అందడం సాధ్యమవుతోందని అధికారులు తెలిపారు.