కోనసీమ: ఆస్తి పన్ను వసూళ్లలో మండపేట పురపాలక సంఘం అద్భుత ప్రగతి సాధించి, రాష్ట్ర స్థాయిలో 7వ స్థానంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 6.91 కోట్ల లక్ష్యానికి గాను రూ.6.01 కోట్లు (72.59%) వసూలు చేసినట్లు కమిషనర్ రంగారావు తెలిపారు. అధికారులు చేపట్టిన వినూత్న ప్రచారానికి స్పందించిన పట్టణవాసులు స్వచ్ఛందంగా పన్నులు చెల్లించారు.