SRD: ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు ఇవాళ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మాత్రమే కార్మికులు అడుగుతున్నారని చెప్పారు.కార్యక్రమంలో జిల్లా సహాయ కార్య దర్శి యాదగిరి పాల్గొన్నారు.