TG: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రామచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖర్గే ఇక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వడం మంచిదని సలహా ఇచ్చారు. ఖర్గే తన సొంత ఆలోచనతో మాట్లాడటం లేదని, కేవలం రాహుల్ గాంధీ కనుసన్నల్లోనే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఖర్గే చేసే ప్రతి ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.