NRPT: జ్యోతిరావు పూలే ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రవీంద్రభారతిలో నిర్వహించిన ఫూలే జయంతి వేడుకల్లో ఉప ముఖ్యమంత్రితో కలిసి ఆయన పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పూలే చేసిన పోరాటం గొప్పదని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.