ASF: కాగజ్ నగర్ మండలం కోస్ని గ్రామంలో శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడన్నారు.