WNP: అమరచింత మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం ఉత్సాహంగా సాగింది. రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో జరిగిన ఈ ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తౌపిక్, మణెమ్మ.. సీపీఎం నుంచి చిన్నన్న, షాజహన్ సభ్యులుగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో ఈ కొత్త సభ్యులు కీలక పాత్ర పోషించాలన్నారు.