ADB: జాతీయ కుటుంబ లాభ పథకం (NFBS) ద్వారా నిరుపేద కుటుంబాలకు రూ. 20,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. 18-60 ఏళ్ల మధ్య ఉండి, కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఈ సాయం అందుతుందన్నారు. అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వ NSAPలో భాగంగా అమలవుతోంది.