KMM: అమర్నాథ్ యాత్ర-2026కు వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ తెలిపారు. ఆసుపత్రిలోని గది సంఖ్య 105 Aలో వైద్య పరీక్షల అనంతరం ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తామన్నారు. యాత్రికులు గుర్తింపు కార్డు, ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 85558 62801 నంబరును సంప్రదించాలని కోరారు.