AP: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయ నిర్మాణంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టొద్దని హెచ్చరించింది. ప్రభుత్వం అనుమతితోనే కూల్చివేత లేదా నిర్మాణం జరగాలని ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.