ADB: గుడిహత్నూరు మండలంలోని సీతాగొందిలో గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు బుధవారం గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆడే గజేందర్ పేర్కొన్నారు.