BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2025-26 ఫ్రీ ప్రైమరీ బడ్జెట్లో సిబ్బందిని నియమించకుండా రూ.60,000 అక్రమంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటన పై DEO, MEO స్పందించి అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.