MNCL: నస్పూర్ మండల కేంద్రంలో రూ.1.34 కోట్ల మిషన్ వాత్సల్య నిధులతో నిర్మిస్తున్న బాలసదనం భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులను నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు.