KNR: కాంగ్రెస్ కార్యదర్శిగా నియమితులైన బధావత్ భిక్షపతి నాయక్‌కు పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. సైదాపూర్ ఏఎంసీ ఛైర్మన్ దొంత సుధాకర్, ఇతర నాయకులు మాట్లాడుతూ.. కష్టపడే వారికి కాంగ్రెస్‌లో సముచిత స్థానం ఉంటుందని, భిక్షపతి నాయక్ నియామకంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.