AKP: జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు డీఐఈవో వినోద్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ ఇయర్ 10,315 మంది విద్యార్థులు హాజరు కాగా 7,602 మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు. అలాగే, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 9,926 విద్యార్థులు పరీక్షలు రాయగా 7,829 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.