కృష్ణా: కృత్తివెన్ను మండలం నిడమర్రు గ్రామంలో మత్స్యకారులకు బోట్ లైసెన్స్ పత్రాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. బోట్ లైసెన్సులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మత్స్యకారులు పథకాలు, ప్రోత్సాహకాలు అందుకోవచ్చని తెలిపారు.