TPT: వెదుళ్ళ చెరువు ఎస్టీ కాలనీలో అగ్నిప్రమాదానికి గురై మరణించిన బండి రాణెమ్మ కుటుంబాన్ని ఎమ్మెల్యే సతీమణి రిషితా రెడ్డి పరామర్శించారు. టీడీపీ సభ్యత్వం కలిగి ఉన్న రాణెమ్మ కుటుంబానికి పార్టీ ప్రమాద బీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆమె అందజేశారు. రిషితా రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ఆపద కాలంలో టీడీపీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.