బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, దర్శకుడు డేవిడ్ ధావన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా’. ఇందులో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్లో కృతి సనన్ మెరవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెతో చర్చలు జరపగా, అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.